సమస్యలకు పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. కౌలాలంపూర్ పర్యటనలో ఉన్న ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఎలాగైనా ముగింపు తీసుకురావాలనే భారత్ భావిస్తోందని తెలిపారు. రణంలో విజేతలు ఉండరని, యుద్ధం ముగిసేసరికి అమాయకులు కూడా నష్టపోతారని అన్నారు. గాజా ఉద్రిక్తతలకూ ఇదే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.