UPDATES  

 శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు..

  • శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు
  • గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు
  • అలరించిన ఆదివాసీ థింసా నృత్యాలు

మన్యం న్యూస్, మంగపేట.

మంగపేట మండలం వాగొడ్డు గూడెం గ్రామం లో వెలిసిన శ్రీ నాగులమ్మ అమ్మవారికి సుంకు పండగ ను గురువారం రోజున ఘనం గా నిర్వహించారు.కార్యక్రమం లో భాగంగా గురువారం ఉదయం శ్రీ నాగులమ్మ మణి రూపం లో కొలువున్న గండోర్రే గుట్ట ప్రాంతానికి చేరుకున్న పూజారులు అమ్మవారికి సంబంధించిన పడ(గుహ) వద్ద పసుపు కుంకుమ లతో అలంకరించి పూజలు చేసారు.అనంతరం పాలయిగూడెం వద్ద ఉన్న గోదావరి నదికి డోలు వాయిద్యాల నడుమ శ్రీ నాగులమ్మ అమ్మవారికి సంబంధించిన ఏల్పుల జెండాలను తీసుకు వెళ్లి గోదావరి నది ప్రవహించే అంచున ఏడు జలకం బావులను(చెలిమె) లను ఏర్పరిచి పసుపు కుంకుమ, వివిధ పుష్పాలతో ,పత్రాలతో పూజారులు పూజలు నిర్వహించారు.అనంతరం పవిత్ర జలాలతో స్నానాలు నిర్విహించారు.అనంతరం రాత్రి అమ్మవారికి సంబంధించిన ఏల్పుల యొక్క డాలు గుడ్డ కు వరి ధాన్యం తో సుంకు కార్యక్రమాన్ని రాత్రి 11.45 నిమిషాలకు “సుంకు “ నిర్వహించి డాలు గుడ్డ చరిత్ర ను ఆదివాసీ పూజారి నాగుల శ్రీరాములు వివరిస్తారు.సుంకు పండగ లో సాంప్రదాయక ఆదివాసీ థింసా నృత్యాలు అలరించాయి.పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యం లో నిర్వహించగా,పూజారులు ,వడ్డెలు బాడిశ నాగరమేష్,మడకం లక్ష్మయ్య,సోడి సత్యం ,మూయబోయిన శివ,కుర్సం పుల్లయ్య,ఈసం సమ్మక్క,కోర్స శ్రీకాంత్,చౌలం భవానీ,కట్టం సమ్మక్క,తుర్స చిన్నాబ్బాయి,సోడి శ్రీను,ఇర్ప రామకృష్ణ,కొమరం ధనలక్ష్మి,కొమరం పాపరావు,ఆదివాసీ కుల పెద్దలు కుర్సం విష్ణు మూర్తి,మడకం రాజేశ్వర్ రావు,కోర్స ముసలయ్య,కారం సాంబయ్య,మడకం రమేష్,కుర్సం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !