మన్యం న్యూస్, మంగపేట.
నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు గురువారం ఆయన మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో రైతు భవనంలో వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసిన శీతల చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వేసవి తాపం నుండి దాహం తీరేలా శీతల చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వినయ్ కుమార్ రెడ్డి ట్రస్టు ప్రెసిడెంట్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అభినందనీయుడు అని ఆయన సేవలను సాంబశివరెడ్డి కొనియాడారు జిల్లా సరిహద్దు జంట గ్రామాలైన ఆకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం ప్రజలు ఈ శీతల చలివేంద్రం కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ నాసిరెడ్డి భార్గవ్ రెడ్డి నాగిరెడ్డి అచ్చమ్మ కృష్ణారెడ్డి పాడి దామోదర్ రెడ్డి దాట్ల శ్రీనివాసరాజు కాట్రగడ్డ రవీంద్రనాథ్ స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు