మన్యం న్యూస్ కరకగూడెం:డిఅర్ డిఓ ఆదేశాల మేరకు కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి రైతు వేదిక నందు మహాత్మ గాందీ జాతీయ ఉపాధి హామీ పనిపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపిడిఓ కె ఎస్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డిఅర్ డిఓ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మెట్స్,పిల్డ్ అధికారులు,టెక్నికల్ అసిస్టెంట్స్ కి ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినదని, అలాగే ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం 272 రూపాయలు పోందె విధంగా పనిచేయించాలని,లెబర్ పెంచడం పని ప్రదేశంలో కనిస సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలని శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపిఓ శ్రీను,ఎంపిఓ కుమార్, ఈసి సందీప్,బక్కయ్య మేట్స్,పిల్డ్ అసిస్టెంట్ లు 16 గ్రామపంచాయతిల సెక్రటరీలు పాల్గొన్నారు.