UPDATES  

 ఘనంగా ముగిసిన శ్రీ నాగులమ్మ తల్లి సుంకు పండగ…

 

మన్యం న్యూస్, మంగపేట.

 

నాలుగు రోజుల పాటు జరిగిన సుంకు పండగ వేడుకలు

 

భారీ గా హాజరై వేడుక ను తిలకించిన భక్త జనం

 

ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు

 

అమ్మవారి ఊరేగింపు తో ముగిసిన పండగ

 

మంగపేట మండలం వాగొడ్డు గూడెం గ్రామం లో వెలిసిన శ్రీ నాగులమ్మ అమ్మవారికి సుంకు పండగ నాలుగు రోజుల పాటు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ఘనం గా జరిగాయి.శుక్రవారం సాయింత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని లక్ష్మీనర్సాపూర్,రాజుపేట,వాగొడ్డుగూడెం గ్రామాలలో పల్లకీ లో తిప్పుతూ భక్తి శ్రద్ధలతో ఘనం గా నిర్వహించారు.అంతకుముందు రోజు రాత్రి గోదావరి పుణ్యస్నానాలు అనంతరం రాత్రి 11.45 నిమిషాలకు అమ్మవారిఏల్పుల జెండాలను ఆలయ ప్రాంగణం లో ఎదురుగా పూజలు చేసిన తర్వాతవడ్లు పోసి ఏల్పుల జెండాలను ప్రతిష్టించారు.అనంతరం రాత్రి 2.15 నిమిషాలకు అమ్మవారికి సంబంధించిన డాలు గుడ్డ యొక్క చరిత్ర ను కోయ పండితుడు నాగుల శ్రీరాములు 2 గంటల పాటు వివరించారు.సుంకు పండగ లో సాంప్రదాయక ఆదివాసీ థింసా నృత్యాలు ప్రత్యక ఆకర్షణ గా నిలిచాయి.పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యం లో నిర్వహించగా,పూజారులు ,వడ్డెలు బాడిశ నాగరమేష్,మడకం లక్ష్మయ్య,సోడి సత్యం ,మూయబోయిన శివ,కుర్సం పుల్లయ్య,ఈసం సమ్మక్క,కోర్స శ్రీకాంత్,చౌలం భవానీ,కట్టం సమ్మక్క,తుర్స చిన్నాబ్బాయి,సోడి శ్రీను,ఇర్ప రామకృష్ణ,కొమరం ధనలక్ష్మి,కొమరం పాపరావు,ఆదివాసీ కుల పెద్దలు కుర్సం విష్ణు మూర్తి,మడకం రాజేశ్వర్ రావు,కోర్స ముసలయ్య,కారం సాంబయ్య,మడకం రమేష్,కుర్సం నరేష్ పాల్గొన్నారు మరియు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క తనయుడు ధనసరి సూర్య,ఆదివాసీ నాయకులు మైపతి అరుణ్ కుమార్ ,వివిధ పార్టీ లకు చెందిన నాయకులు,కుల సంఘాల నాయకులు హాజరై అమ్మవారిని దర్శించకొని పూజలు నిర్వహించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !