సౌత్ వర్సెస్ నార్త్‌పై ప్రియమణి కామెంట్స్ వైరల్ అయ్యాయి. ‘‘ హిందీ భాషను అనర్గళంగా మాట్లాడగలం. అంతేకాదు అందంగా కూడా ఉంటాం. కాకపోతే మా రంగు నార్త్ వాళ్లంత ఫెయిర్‌గా ఉండదంతే. కానీ అది పెద్ద విషయమేమీ కాదు. సౌత్ నుంచి వచ్చే నటీనటులకు అన్ని భాషలపైనా అవగాహన ఉంటుంది. డైలాగులు చెప్పేటప్పుడు గ్లామర్ తప్పులు ఉన్నా, భావోద్వేగాలను పండిస్తాం. అయినా నార్త్, సౌత్ అని వ్యత్యాసం చూడకూడదు. అందరూ భారతీయ నటీనటులే’ అని అన్నారు.