ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలాజీ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికరమైనదని, భౌతికంగా మన మధ్యన లేకున్నా ఆయన ఎప్పటికీ బతికే ఉంటారని కమల్ హాసన్ అన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని నటుడు సందీప్ కిషన్ అన్నారు. ’మంచి మనసు, ప్రతిభ ఉన్న వ్యక్తి లోకం విడిచివెళ్లిపోవడం తీరని విషాదం. మీ కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి‘ అని నటుడు సూర్య, లావణ్య త్రిపాఠి, నానీ సంతాపం తెలిపారు.