’టిల్లు 3‘ని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టిల్లు స్క్వేర్ ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ’’ఈ మూవీ తొలి షో నుంచే మంచి టాక్ వచ్చింది. వేసవి సెలవులు కలిసొస్తాయి. తప్పకుండా ఈ చిత్రం రూ.వంద కోట్లు వసూళ్లు సాధిస్తుందని నమ్మకం ఉంది‘ అని నిర్మాత అన్నారు.