సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ ఆంక్షలు విధించింది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 నుండి చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ అనుమతించబడవని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రసారం చేయడం, ప్రచురించడం వంటివి చేయరాదని నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల అంచనాలు, సర్వేలను ప్రసారం చేయవద్దని ఆదేశించారు.