మన్యం న్యూస్ మంగపేట.
మంగపేట మండలంలోని పొదుమూరు గ్రామానికి చెందిన కుప్ప నాగ శ్రావణి నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి తండ్రి చనిపోయాడు తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. వీరికి ఉండటానికి ఇల్లుకుడా లేదు. అమ్మాయి వాళ్ళ మేనమామ బద్ధి రఘుబాబు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుక రాగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు ఈ అమ్మాయి పెళ్లి కోసం ఏడువేల నూట పదహార్లు (7116) రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ , గౌరవ సలహాదారులు కులగట్ల నరేష్ రెడ్డి గారు, చాదా మల్లయ్య, సయ్యద్ బాబా , కల్లబోయిన సురేష్ , ప్రధాన కార్యదర్శి మునిగల రాకేష్ , కార్యదర్శి బండపల్లి రవి, ఆత్మకురి సతీష్, ఉపాధ్యక్షులు పుల్లంశెట్టి అజయ్ , కస్పా ముకుందం, ప్రచార కార్యదర్శి గగ్గూరి మహేష్, మహమ్మద్ ఇంతియాజ్, కోశాధికారి కొండపర్తి నగేష్, ముప్పారపు రాజు మిగతా సభ్యులు పాల్గొన్నారు.