ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను. ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా. గతంలో నేనొకరిని ప్రేమించా. అది వర్కౌట్ కాలేదు’’ అని చెప్పారు.