’12th ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్రాంత్ మాస్సే భార్య శీతల్ ఠాకూర్ ఫిబ్రవరి 7న పండంటి బాబుకి జన్మనిచ్చారు. ఈ బాబుకి వర్ధన్ అని పేరు పెట్టారు. తాజాగా విక్రాంత్ మస్సె తన కొడుకు పేరు వర్దాన్, పుట్టిన తేదీ 7-2-2024ను చేతిపై టాటూ వేయించుకున్నారు. ఈ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘అడిషన్ ఆర్ అడిక్షన్?.. రెండింటినీ నేను ప్రేమిస్తాను’ అని రాసుకొచ్చారు.