భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగిరావడం మరింత ఆలస్యం కానుంది. బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది. దీంతో జూన్ 26న వారి తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ(NASA) షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. అయితే వారిద్దరు భూమిపైకి ఎప్పుడు వస్తారనే విషయమై నాసా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.