17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. బెరిల్ హరికేన్ ప్రభావంతో రెండు రోజులుగా బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమ్‌ఇండియా జట్టు స్వదేశానికి పయనం కానుంది. ప్లేయర్ల కోసం బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. బుధవారం టీమ్‌ఇండియా జట్టు భారత్‌కు బయలుదేరనుంది. ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త ఊరటనిచ్చినట్లయింది.