ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ ను జులై 20, 21 తేదీల్లో నిర్వహించనుంది. కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే నిర్వహించే ఈ సేల్ లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి.