మన్యం న్యూస్ వాజేడు.
వాజేడు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గిరిజన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశాల కొరకు ఈనెల 4న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో మిగిలిన సీట్లకు గిరిజన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వ్యక్తం చేశారు.ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఆధార్ కార్డ్ ఫోటోలు తీసుకొని రావాలని ఈ సందర్భంగా కోరారు.