UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 ఈడీ, ఐటీ దాడులను ఎదుర్కోవటానికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వరుసగా మంత్రులపై కొనసాగుతున్న ఈ డి, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచనలో పడ్డారా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలి అన్నదానిపై కెసిఆర్ తీవ్రంగా ఆలోచిస్తున్నారా? ఒక కొత్త వ్యూహాన్ని రచించే పనిలో పడ్డారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో యుద్ధం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెసిఆర్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రమేయం ఉందని గట్టిగా భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తెలంగాణ పై ఫోకస్ పెట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థలు, చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం పైన కూడా సీరియస్ గా దృష్టి సారించాయి.
ఇక ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ సంస్థలపైన, కెసిఆర్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న బడా పారిశ్రామికవేత్తల పైన దాడులు మొదలుపెట్టాయి. ఇక ఈ విషయాన్ని ముందే ఊహించిన కేసీఆర్ ఇప్పటికే దాడులు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మంత్రులపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుగుతున్న దాడులను ఏ విధంగా అడ్డుకోవాలి అన్నదానిపై కెసిఆర్ తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి మల్లారెడ్డి ఇలా ఒక్కొక్కరు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రాన్ని అడ్డుకోవడం కోసం ఏం చేయాలన్న దానిపై కెసిఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. కేంద్రం దాడులతో తెలంగాణ ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్న కేసీఆర్ ప్రజాక్షేత్రంలో బిజెపి దాడులను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం.
ఒక తెలంగాణ రాష్ట్రం పైనే కాకుండా దేశవ్యాప్తంగా తాము అధికారంలో లేని రాష్ట్రాలలో బీజేపీ చేయిస్తున్న దాడులపై సమగ్ర నివేదికను తయారుచేసి ఈ నివేదికను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.
తద్వారా ఈడీ, ఐటీ, సిబిఐ అధికారుల దాడులతో ఇబ్బందిపడిన రాష్ట్రాల మద్దతు కూడా తమకు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి తెర తీయవచ్చని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఈడీ, ఐటి అధికారుల దాడులకు చెక్ పెట్టడం కోసం సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తాజా పరిణామాలతో తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ తాజా వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !