UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 బాదం, చికెన్ మోమోస్​ ..ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​లో ప్రోటీన్

ఉదయాన్నే చాలా మంది తమ బ్రేక్​ఫాస్ట్​లో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు. జిమ్​కి వెళ్లేవారు.. ఆరోగ్యానికి ప్రాధన్యతనిచ్చే వారు కచ్చితంగా తమ డైట్​లో ప్రోటీన్​కి చాలా పెద్ద పీట వేస్తారు. మీరు కూడా ఫిట్​నెస్​ ఫ్రీక్​ అయితే.. మీ డైట్​లో బాదం, చికెన్ మోమోస్​లను యాడ్ చేసుకోవచ్చు. ఇవి విభిన్నమైన, రుచికరమైన టేస్ట్​ని ఇవ్వడంతో పాటు.. సులభంగా తయారు చేసుకోగలిగే ఓ వంటకం ఇది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
చికెన్ – 250 గ్రాములు (బోన్ లెస్) * వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి) * క్యారెట్ – 1 (సన్నగా తరగాలి) * స్ప్రింగ్ ఆనియన్ – 3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి) * అల్లం – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి) * సోయా సాస్టర్ – 1 టేబుల్ స్పూన్ * నూనె – డీప్ ఫ్రైకీ తగినంత * బాదం – 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి) తయారీ విధానం చికెన్ ఓ గిన్నెలో తీసుకుని సన్నగా తరగాలి. దానిలో బాదం తప్పా.. మిగిలిన పదార్థాలన్నీ వేసి సమాన పరిమాణంలో ఉండే బాల్స్‌గా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ బాల్స్‌ను సన్నగా తరిగిన బాదంపప్పులో రోల్ చేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న వాటిని.. ఒక greased ప్లేట్‌లో జాగ్రత్తగా ఉంచి.. స్టీమర్‌ మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. వేడి సమానంగా ఉంచుతూ.. ఆవిరి మీద ఉడికనివ్వాలి. అనంతరం వీటిని కాస్త ఫ్రై చేసుకుని.. గోల్డెన్ కలర్ వచ్చాక దించేసుకోవాలి. వీటిని మీకు ఇష్టమైన కెచప్​తో లేదా గ్రీన్ చట్నీతో సేవించవచ్చు. మీ ఫుడ్​లో నూనె వద్దు అనుకుంటే.. వీటిని ఉడికించిన వెంటనే ఫ్రై చేయకుండా కూడా హ్యాపీగా తినేయవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !