UPDATES  

NEWS

 పుట్టుమచ్చలను తొలగించుకునేందుకు అధునాతనమైన చికిత్సా విధానాలు

పుట్టుమచ్చలు మెలనోసైట్లు అనే వర్ణద్యవ్యం కణాల సమూహాల వల్ల ఏర్పడతాయి. ఇవి తరచుగా నలుపు, ముదురు గోధుమ రంగు మచ్చలుగా కనిపిస్తాయి. సాధారణంగా చాలా మందికి బాల్యం నుంచి పుట్టుమచ్చలు రావడం మొదలవుతుందు. శరీరం అంతటా సుమారు 10 నుండి 40 పుట్టుమచ్చల వరకు ఏర్పడవచ్చు. కౌమారదశలో గరిష్టంగా ఏర్పడతాయి, ఇవి కాలక్రమేణా రూపాన్ని మార్చవచ్చు లేదా మసకబారవచ్చు. ఒక పుట్టుమచ్చ సగటు జీవితచక్రం సుమారు 50 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ముఖంపై ఏర్పడే ఈ పుట్టుమచ్చలు కొన్ని చోట్ల ఉండటం అందాన్ని పెంచవచ్చు. కానీ అవి విస్తరిస్తూ ఎక్కువ ఏర్పడినపుడు, దట్టమైన మొటిమలుగా మారినపుడు మొత్తం అందాన్ని దెబ్బతీస్తాయి. కొంతమందికి పుట్టుమచ్చల మీద వెంట్రుకలు కూడా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల చాలా మంది ముఖంపై పుట్టుమచ్చలను కోరుకోరు. వీటిని తొలగించుకునేందుకు అధునాతనమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఖర్చులేని కొన్ని హోం రెమెడీస్ కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. DIY Home Remedies To Remove Moles- పుట్టుమచ్చలు తొలగించడానికి చిట్కాలు మీరు మీ ముఖంపై కనిపించే ముఖంపై అవాంఛిత పుట్టుమచ్చలను వదిలించుకోవాలనుకుంటే, వెల్లుల్లి ఎఫెక్టివ్ రెమెడీగా పనిచేస్తుంది. వెల్లుల్లి మీ చర్మంలో మెలనిన్ స్థాయిని తగ్గించడం ద్వారా పుట్టుమచ్చలు, నల్లమచ్చల రంగును తగ్గిస్తుంది. పుట్టుమచ్చలను పోగొట్టుకునేందుకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి. వెల్లుల్లి క్రష్ చర్మంపై ఉన్న పుట్టుమచ్చలు లేదా మొటిమలు తొలగించడానికి, ఒక వెల్లుల్లి రెబ్బను, అలాగే ఒక లవంగాన్ని తీసుకుని, బాగా క్రష్ చేయండి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు ఉన్నచోట అద్ది సుమారు 4-5 గంటల పాటు అలాగే ఉంచండి. ఇందుకోసం బ్యాండేజ్ ఉపయోగించవచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే మచ్చ ఉన్నచోటనే ఈ మిశ్రమం అప్లై చేయాలి. ఆ తర్వాత తొలిగించి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు ఈ చిట్కా పాటించడం ద్వారా పుట్టుమచ్చ తగ్గుతుంది. వెల్లుల్లి – వెనిగర్ పుట్టుమచ్చ తొలగించడానికి వెల్లుల్లి, ఆపిల్ సైడర్ వెనిగర్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం వెల్లుల్లి మొగ్గలను మెత్తగా పేస్ట్ చేయండి. ఆ తర్వాత దీనికి వెనిగర్ కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మోల్ లేదా మొటిమల మీద అప్లై చేయండి. సుమారు 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. స్వల్పకాలంలోనే ఇది పుట్టుమచ్చను తొలగించగలదు. వెల్లుల్లి – ఉల్లిపాయ ఉల్లిపాయ రసం, వెల్లుల్లిని ఉపయోగించడం కూడా పుట్టుమచ్చ తొలగించడానికి ఒక సమర్థవంతమైన మార్గం. ఇందుకోసం వెల్లుల్లి, ఉల్లిపాయలను సమాన పరిమాణంలో కలపి రుబ్బండి. ఇప్పుడు దాని నుండి రసం తీసి కాటన్ బాల్ సహాయంతో పుట్టుమచ్చపై రాయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. కొంతకాలం పాటు ఇలా చేస్తే ఇది మోల్ మార్కులను తొలగించగలదు. అయోడిన్ ఉపయోగించండి వెల్లుల్లి, ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మంపై మంట పుట్టిస్తుంది. ఇలాంటి సందర్భంలో అయోడిన్ ఉపయోగించవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. కొత్త అయోడిన్ ఉత్పత్తిని కొనుగోలు చేయాలి, అందులో 5 శాతం అయోడిన్ మాత్రమే ఉండేలా చూసుకోండి. కాటన్ బాల్ సహాయంతో అయోడిన్‌ను నేరుగా మోల్‌పై రోజుకు మూడు సార్లు వర్తించండి. మీరు పుట్టుమచ్చ రూపం మారటం గమనించే వరకు, ప్రతిరోజూ దీన్ని కొనసాగించండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !