ఎప్సమ్ సాల్ట్ అనేది.. అనేక వ్యాధులకు ఒక ప్రసిద్ధ ఔషధం. ఇది కండరాల నొప్పి, వాపు, నొప్పులు, ఒత్తిడి నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది.
ఈ ఎప్సమ్ లవణాన్ని మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఆక్సిజన్, మెగ్నీషియం, సల్ఫర్‌లతో కూడిన రసాయన సమ్మేళనం.
ఈ ఉప్పు వందల సంవత్సరాలుగా ఫైబ్రోమైయాల్జియా, నిద్రలేమి, మలబద్ధకం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఎప్సమ్ సాల్ట్‌తో స్నానం చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి..
ఎప్సమ్ సాల్ట్‌లోని ముఖ్యమైన ఖనిజాలు శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మలబద్ధకానికి చికిత్స చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇందులోని మెగ్నీషియం.. దాని లోపం ఉన్నవారికి, ఫైబ్రోమైయాల్జియా ఉన్నవారికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటితో నిండిన బాత్‌టబ్‌లో ఎప్సమ్ సాల్ట్‌ను వేసి అందులో 12-15 నిమిషాలు నానబెట్టి మీ శరీరాన్ని డిటాక్స్ చేసి ఒత్తిడిని వదిలించుకోండి.
చర్మంపై చికాకు లేదా మంటను దూరం చేసుకోవడానికి
ఎప్సమ్ సాల్ట్ బాత్ మీకు విశ్రాంతిని అందించడమే కాకుండా కాంటాక్ట్ డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, అథ్లెట్స్ ఫుట్ వల్ల కలిగే చర్మపు చికాకు, మంటను కూడా తగ్గిస్తుంది. ఇది క్రిమి కాటు, కాలానుగుణ మార్పులు లేదా పాయిజన్ ఐవీ వల్ల కలిగే పొడి, దురదను దూరం చేస్తుంది.