రిలయన్స్ జియో కొత్త ప్లాన్ ప్రకటించింది. 4జీ డేటా యాడ్ ఆన్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను జియో తీసుకొచ్చింది. ఫిఫా కప్ జరుగుతున్న వేళ ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం ఫుట్ బాల్ కప్ డేటా ప్యాక్ తీసుకొచ్చింది. జియో రూ.222 ధరకు డేటా యాడ్ ఆన్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 50జీబీ డేటా లభిస్తుంది. 50జీబీ డేటా వాడుకున్న తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఇందులో కాలింగ్ బెనిఫిట్స్ వుండవు. డేటా మాత్రమే అన్ లిమిటెడ్‌గా పొందవచ్చు.