UPDATES  

 దాని ఫేస్ ఎప్పుడైనా చూసారా..రష్మిక మీద దారుణమైన కామెంట్ లు..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుసు కదా. తను ఇప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాదు. తనకు బాలీవుడ్ లోనూ క్రేజ్ పెరిగింది. ఒక్కసారిగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది రష్మిక. అయితే.. తాజాగా రష్మిక మందన్నాపై ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఏదో ఒకటి విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఆయన రష్మిక మందన్నాపై చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ లో విపరీతంగా చర్చ నడుస్తోంది.బాలీవుడ్ లో ఇప్పటికే ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ లాంటి హీరోయిన్లను చూశాం. రష్మిక మందన్నా బాలీవుడ్ కు సెట్ అవ్వదు అంటూ డైరెక్ట్ గానే బాంబ్ పేల్చేశాడు. ట్విట్టర్ లో ట్వీట్ వేసిన ఆయన.. సౌత్ లోనే రష్మిక మందన్నా హీరోయిన్ గా సెట్ అవుతుందన్నాడు.

ఆమె ఫేస్ హిందీ సినిమాలకు సెట్ కాదని.. బాలీవుడ్ లో తన ఫేస్ కు వాల్యూ లేదని.. తను కేవలం భోజ్ పూరీ సినిమాకు మాత్రమే సెట్ అవుతుందని.. ఒకవేళ తను బాలీవుడ్ లో రాణించాలనుకుంటే అది తన రాంగ్ డెసిసన్ అంటూ చెప్పుకొచ్చాడు అతడు. ఆమె ఫేస్ కు అంత సీన్ లేదని డైరెక్ట్ గా చెప్పేశాడా? అటువంటి హీరోయిన్లను చూసిన కళ్లతో రష్మిక మందన్నాను ఎలా చూడగలుగుతాం. బాలీవుడ్ ప్రేక్షకులు అస్సలు యాక్సెప్ట్ చేయరు.. ఆమె ఫేస్ కు అంత సీన్ లేదంటూ పరోక్షంగా కామెంట్లు చేశాడు ఆయన. దీన్ని బట్టి చూస్తే రష్మిక మందన్నా బాలీవుడ్ ఆశలు గల్లంతయినట్టేనా. తను ఇప్పటికే బాలీవుడ్ లో రాణించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. ఇప్పుడు ఈ క్రిటిక్ చేసిన వ్యాఖ్యలతో తన బాలీవుడ్ ఆశలు గల్లంతయినట్టేనా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !