ఒకప్పుడు కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే అందాల ఆరబోత చేసేవారు, ఎక్కువ శాతం మంది హీరోయిన్స్ పద్ధతైనా చీర కట్టులో కనిపించే వారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ తో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా అందాల ఆరబోత చేస్తూ మీడియా లో తెగ సందడి చేస్తున్నారు. ఇక బుల్లి తెర యాంకర్స్ అనసూయ మరియు రష్మి తో పాటు ఇంకా పలువురు అందాల ఆర బోత విషయంలో హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదు అంటూ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరో సారి దీపిక పిల్లి తన అందాల ఆరబోతతో అభిమానులను మరియు సోషల్ మీడియా జనాలను కట్టి పడేస్తోంది.
ఈ ముద్దుగుమ్మ అందాలని చూస్తూ ఉంటే మతి పోతుంది అంటూ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ అమ్మడు అందాలతో చంపేస్తుంది బాబోయ్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంత అందగత్తెకు తెలుగులో మంచి సినిమాల్లో నటించే అవకాశాలు రావడం లేదు పాపం అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే.. మరి కొందరు ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా దీపికా పిల్లి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈమె ఒకటి రెండు షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తుంది. మరో వైపు నటిగా కూడా రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాలు వచ్చిన తర్వాత నటిగా ఈమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.