పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ‘జబర్దస్త్’ ఆది. హైపర్ ఆదిగా పాపులర్ అయిన కమెడియన్ ఆది, తెలుగు తెరపై కమెడియన్‌గా ఓ వైపు సత్తా చాటుతూనే, ఇంకో వైపు కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ పరంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. తాజాగా, తన దేవుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా ‘రాత’ సాయం చేస్తున్నాడట హైపర్ అది. పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్రిప్టు కాదు.. స్కిట్టు సాయం.! సినిమాకి సంబంధించి కొన్ని కామెడీ సీన్ల విషయమై స్క్రిప్టు సాయం చేస్తున్నాడట హైపర్ ఆది . రైటర్ సాయి మాధవ్ బుర్రాతో కలిసి హైపర్ ఆది పని చేస్తున్నాడని సమాచారం. కామెడీ పోర్షన్స్‌లో హైపర్ ఆది సృష్టించే కామెడీ కడుపుబ్బా నవ్వించనుందట. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రమిది. తొలిసారిగా పవన్ కళ్యాణ్ చారిత్రక నేపథ్యమున్న కథతో సినిమా చేస్తుండడం గమనార్హం.