మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 05: రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మణుగూరులో నిర్వహించే నియోజకవర్గ స్థాయి వాలిబాల్ పోటీల్లో ప్రతి గ్రామం నుండి టీమ్ పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వవిప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం అన్నారు. కెసిఆర్ కప్ లో పాల్గొన్న ప్రతి వాలిబాల్ టీమ్ కు సూపర్ వాలీ మ్యాచ్ బాల్(కాస్కో), ఒక నెట్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మ్యాచ్ లు డే అండ్ నైట్ లు జరుగుతాయని, క్రీడాకారులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. వాలిబాల్ నా కౌట్ కం లేగ్ పద్దతిలో ఆడించడం జరుగుతుందన్నారు. మొదటి 4 టీమ్ లకు షీల్డ్ తో పాటు నగదు బహుమతులు ఇస్తున్నామన్నారు. వాలీబాల్ పోటీలో మొదటి బహుమతి 50 వేల రూపాయలు అందజేస్తామన్నారు. ప్రతి గ్రామం నుండి క్రీడాకారులు పాల్గొనేలా యువజన నాయకులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సత్తా చాటాలన్నారు.