అభివృద్ధి ఎవరు చేశారో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం…
-నేను నిధులు తీసుకువస్తే ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు.
-సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారు.
-పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10: పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం తొగ్గూడెం సమ్మక్క సారలమ్మఆలయం వద్ద జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎన్నికల ముందు నేను మంజూరు చేయించిన నిధులకు ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా అన్ని గ్రామాల్లో తిరుగుదామని ఎవరు ఏమి అభివృద్ధి చేశారో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
