UPDATES  

 భద్రాచలంలో బాలుడు కిడ్నాప్ రూ.4.5 లక్షలకు అమ్మకం – కేసును చేదించిన భద్రాచలం పోలీసులు

 

మన్యం న్యూస్, భద్రాచలం , జనవరి 14
భద్రాచలంలో బాలుడి కిడ్నాప్ సంఘటన కలకలం.
అయితే బాలుడు మిస్ అయినట్లు కంప్లైంట్ వచ్చిన నాటి నుంచి భద్రాచలం పోలీసులు ఈ కేసును చాలెంజిగా తీసుకొని అత్యంత చాకచక్యంగా కేసును చేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు పోలీసులు శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఈనెల 6వ తారీఖున 8 సంవత్సరాల బాలుడు అదృశ్యం అయ్యాడని బాలుడు తల్లి భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే భద్రాచలం ఏఎస్పి పర్యవేక్షణలో భద్రాచలం సీఐ, అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేసి భద్రాచలంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. దర్యాప్తులో దొరికిన ఆధారాలతో కేసులు చేదించి ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో అశోక్ నగర్ కాలనీకి చెందిన కందుల అన్నపూర్ణ, ఆమె రెండో కూతురు అనూష, కొడుకు సాయిరాము లు డబ్బుపై అత్యాశతో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు సంపాదించుకోవాలని పథకం పన్నినట్టు తెలిసింది. ఈ క్రమంలో వారు రాజమండ్రి కి చెందిన బెండ తులసి అనే మహిళ ద్వారా డా. స్నేహలత, ఈసాక్ గుణం అడ్వకేట్ దంపతులకు సంతానం లేనందున వారికి కిడ్నాప్ చేసిన బాలుడిని రూ.4 లక్షల 50 వేల రూపాయలకు అమ్మేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ పథకంలో భాగంగా బాలుని చూపించేందుకు గత సంవత్సరం డిసెంబర్ 27న రాజమండ్రి కి తీసుకువెళ్లి అదే రోజు తిరిగి భద్రాచలం తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈనెల 6న కందుల అన్నపూర్ణ ఆమె రెండో కూతురు అనూష, కొడుకు సాయిరాం లు బాలుడిని కిడ్నాప్ చేసి రాజమండ్రి కి తీసుకువెళ్లి బండ తులసి ద్వారా బాలుడిని డా. స్నేహలత, ఈసాక్ గుణం అడ్వకేట్ దంపతులకు నాలుగు లక్షల 50 వేల రూపాయలకు అమ్మి అందులో బెండ తులసికి 50 వేల రూపాయలు ఇచ్చారు. కాగా శనివారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు కందుల అన్నపూర్ణ కందుల అనూష కందుల సాయిరాం లను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారు తమ నేరం చేసినట్లుగా అంగీకరించారు. వారి నేర అంగీకారం ప్రకారండా. స్నేహలత, ఈసాక్ గుణం, బెండ తులసి లను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ 3.10 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కిడ్నాప్ అయిన బాలుడిని ఉన్నతాధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. బాలుడు కిడ్నాప్ చేసిన చాలెంజింగ్ గా తీసుకొని అత్యంత చాకచక్యంగా పూర్తి చేసిన పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !