మన్యం న్యూస్, దమ్మపేట, జనవరి 14: మండల పరిధిలోని పలు గ్రామాల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం శనివారం పర్యటించారు. మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ నీలాద్రి అలియాస్ చెన్నారావు కొన్ని రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని సోయం వీరభద్రం పరామర్శించారు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ధైర్యంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా మండల పరిధిలోని సుధాపల్లి గ్రామానికి చెందిన యువజన కమిటీ సభ్యులు సోయం వీరభద్రం ని వారి ఇంటి దగ్గర మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో దేవరకొండ శ్రీను, నవనూరి వెంకయ్య, భవిన్, కొర్సా, పుల్లారావు, వెల్కమ్ అంజి, నక్క నరేష్ తదితరులు పాల్గొన్నారు.
