మన్యం న్యూస్, అశ్వాపురం: మండల బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం లో శనివారం ఆ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం బి. ఆర్.ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఖమ్మం సభతో దేశ రాజకీయాలలో నూతన శకం ఆరంభం కానున్నదని అన్నారు. మండలం లోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలలో జన సమీకరణ కొరకు గ్రామ శాఖ అధ్యక్షులు ,సర్పంచులు ప్రత్యేక బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల బి.ఆర్.ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,మండల బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు,నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,చిలకా వెంకట్రామయ్య,మేడవరపు సుధీర్,ఐతం సత్యనారాయణ,సర్పంచులు గొర్రెముచ్చు వెంకటరమణ,కుంజ రామారావు,ఎనిక శివాజీ,గొల్లగూడెం ఎంపీటీసీ ఎనిక రవి,మండల బి ఆర్ యస్ పార్టీ ప్రచారా కార్యదర్శి గడకారి రామకృష్ణ,మండల యస్ సి సెల్ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,మండల యస్ టి సెల్ అధ్యక్షులు కోర్స దుర్గారావు, మండల నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
