మన్యం న్యూస్ , మణుగూరు, జనవరి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మణుగూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ శనివారం కోరారు. వార్డుల వారీగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జనవరి 18, 23 వ తేదీన వార్డు 23 కమలాపురం సబ్ సెంటర్, జనవరి 18, 31 న వార్డు 5 మణుగూరు సబ్ సెంటర్, జనవరి 24, 27 న వార్డు 20 పైలెట్ కాలనీ, జనవరి 30, ఫిబ్రవరి 2న వార్డు 15 కుంకుడు చెట్ల గుంపు జిపిఎస్, ఫిబ్రవరి 1, 10న వార్డు 6 మణుగూరు సబ్ సెంటర్, ఫిబ్రవరి 3, 16న వార్డు 16 కుంకుడు చెట్ల గుంపు జిపిఎస్, ఫిబ్రవరి 13, 27న వార్డు 7 బాపన కుంట సబ్ సెంటర్, ఫిబ్రవరి 17, 21న వార్డు 12 బండారి గూడెం సబ్ సెంటర్, ఫిబ్రవరి 22, 24న వార్డు 13 బండారి గూడెం సబ్ సెంటర్, ఫిబ్రవరి 27, మార్చి 2న వార్డు 14 బాలాజీ నగర్, ఫిబ్రవరి 28, మార్చి 27 తేదీలలో వార్డ్ -8లో ఎంపీపీయుపిఎస్ స్కూల్, మార్చి 3, 10 వ తేదీలలో వార్డ్ 17లో బండారి గూడెం సబ్ సెంటర్, మార్చి 3, 15 తేదీలలో వార్డు 21 పైలెట్ కాలనీ సబ్ సెంటర్, మార్చి 16,17 తేదీలలో వార్డు 22 పైలెట్ కాలనీ సబ్ సెంటర్, మార్చి 28, ఏప్రిల్ 12న వార్డు 9 ఎంపీపీ యుపిఎస్ స్కూల్, ఏప్రిల్ 13, 24 తేదీలలో వార్డు 4 రాజుపేట సబ్ సెంటర్, ఏప్రిల్ 25, మే 2వ తేదీన వార్డు 10 శేషగిరి నగర్ సబ్ సెంటర్, మే 3, 8 వ తేదీలలో వార్డు 11 శేషగిరి నగర్ సబ్ సెంటర్, మే 9, 15వ తేదీలలో వార్డు 18 బి ఎస్ నగర్ పిఎస్, జూన్ 28, జులై 5 వ తేదీలలో వార్డు 3 బాపన కుంట సబ్ సెంటర్లలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
