మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
బిఆర్ఎస్ పార్టీ ఈనెల 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని దుమ్ముగూడెం మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు అన్నే సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని లక్ష్మీనగరం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా ఆవిర్భవించి మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసి దుమ్ముగూడెం మండలం నుంచి జన సమీకరణ చేయాలని ఆ పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని, బిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రజలకు స్వచ్ఛమైన అభివృద్ధి దిశగా వెళ్లేందుకు కృషి చేస్తారని దీనికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, పార్టీ మండల కార్యదర్శి కనితి రాముడు, ఎంపీటీసీ తెల్లం భీమరాజు, తిరుపతిరావు, సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరావు, సోడి జ్యోతి, సీతారాం, పార్టీ నాయకులు జయసింహ, ఆదినారాయణ, దామెర్ల శ్రీనివాసరావు, తోట రమేష్, మహిళ అధ్యక్షురాలు సంకీర్తి, తదితరులు పాల్గొన్నారు.
