UPDATES  

 పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో జనాలు ఆందోళన బాట

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో జనాలు ఆందోళన బాట పట్టారు. పాకిస్తాన్ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అతి త్వరలోనే శ్రీలంకలో ఎదురైన పరిస్థితులు పాకిస్తాన్ లో కూడా ఎదురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రజలకు కనీసం ఆహారపు అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితుల్లో పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో పాకిస్తాన్ లో ఉండటం తమ వల్ల కాదు అన్నట్లుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన నిర్వహించిన ఫొటోలు మరియు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇండియాలో తమను కలిసి పోనివ్వాలి అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాక్ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్గిల్‌ రోడ్డును తెరచి భారత దేశంలోని లడఖ్‌ లో ఉన్న తమ తోటి వారితో కలపాలని వారు నినాదాలు చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా అక్కడ ఈ ఆందోళనలు జరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఆందోళనతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియా లో చేరుతుందేమో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !