మన్యం న్యూస్ బూర్గం పహాడ్ జనవరి 16: ఈనెల 18వ తారీఖున భారత రాష్ట్ర సమితి పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మండల ప్రచార కార్యదర్శి జలగం జగదీష్ కోరారు. సోమవారం మన్యం న్యూస్ తో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా. విశిష్టతను సంతరించుకుందని ఈ బహిరంగ సభకు అతిరథ మహారధులు వస్తున్నారని మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలిపారు.
