UPDATES  

 రైళ్లను పునరుద్ధరించకపోతే రైలు రోకో *కొదమ సింహం పాండురంగాచార్యులు

మన్యం న్యూస్,కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం రోడ్డు నుండి కరోనా ముందు నడిచిన అన్ని రైళ్లను పునరుద్ధరించకపోతే రైలు రోకో తప్పదని కొదమ సింహం పాండురంగాచార్యులు హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన సోమవారం రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. బెల్గాం కు వేసిన స్పెషల్ ట్రైన్ ని నడిపించాలని,లేనియెడల కొల్హాపురి ఎక్స్ప్రెస్,ప్యాసింజర్ రైలుని మరల పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే మెయిల్ ద్వారా రాష్ట్రపతికి, రైల్వే మంత్రికి, రైల్వే అధికారులకు ఆయా రైళ్ళను పునరుద్ధరణ చేయాలని కోరినట్లు తెలిపారు.ఇది ఇలా ఉండగా భద్రాచలం రోడ్డు నుండి సత్తుపల్లి వరకు నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ పేర్లను మార్చినందుకు కోయగూడెం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ వారు భద్రాచలం ఏరియా మేనేజర్ కి వినతి పత్రం అందజేశారు. భద్రాచలం రోడ్డు తర్వాత సత్తుపల్లి పోయే లైన్ లో కోయగూడెం పేరును మార్చుట సరి కాదని, కోయగూడెం ప్రజలు ఆస్థులు , పిల్లతో సహా రైల్వే శాఖ కు అప్పగించినప్పటికీ కోయగూడెం పేరు తొలగించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కొదమ సింహం పాండురంగ చార్యులు , మూతి రామకృష్ణ, కంగాల రామకోటేశ్వరరావు, కంగాల కోటేశ్వరరావు, వజ్జా వీరభద్రం ,వజ్జా చైతన్య ,వజ్జా శీను ,బండ శీను, వజ్జా కృష్ణ చైతన్య , వజ్జా శ్రీను, మాడే నరసయ్య, ఈసం పాపారావు, వాసం శీను, వజ్జా సత్యనారాయణ ,సోలం బక్కయ్య, సోలం కిరణ్, కోయగూడెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !