మన్యం న్యూస్ గుండాల. జనవరి 26.. గుండాల, ఆళ్లపల్లి మండలంలో గణతంత్ర వేడుకలు అధికారులు గురువారం ఘనంగా నిర్వహించారు. గుండాల మండలంలో తాసిల్దార్ నాగదివ్య జెండా ఆళ్లపల్లి మండలంలో తాసిల్దార్ సాదియా సుల్తానా జాతీయ జెండాను ఎగరవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీటితోపాటు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు, పాఠశాలలు, కళాశాలలో జాతీయ జెండాను ఎగరవేశారు .