కుట్టు మిషన్ కేంద్రం ప్రారంభించిన రేగా
మహిళలు అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ
కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ఎంపీపీ కి అభినందనలు
మన్యం న్యూస్, పినపాక, జనవరి 28
మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నిధులతో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషిన్, శిక్షణ కేంద్రాన్ని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో, నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి శనివారం ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, సొంత కాళ్లపై నిలబడి నలుగురికి ఆదర్శంగా ఉండాలని కోరారు. కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోని, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తెలియజేశారు. శిక్షకురాలు వీరలక్ష్మి అందించే శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల ఎంపీపీ నిధులతో మండలంలోని మహిళలకు ఉపయోగపడే విధంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీపీ గుమ్మడి గాంధీని అభినందించారు .ఈ కార్యక్రమంలో పినపాక మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.