మన్యం న్యూస్, అశ్వరావుపేట, జనవరి 28.. మండల పరిధిలోని నారావారి గూడెం కాలనీలో మన్యం న్యూస్ తెలుగు దినపత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను వైయస్సార్ తెలంగాణ పార్టీ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం ప్రజల కోసం, సంస్కృతి, సాంప్రదాయాలు, సమస్యలు వెలికి తీయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన్యం న్యూస్ ప్రతినిధులకు శుభాకాంక్షలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల యువజన అధ్యక్షులు తాటి రమణ, నారం శ్రీను, జోగారావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.