మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి 28: క్రమశిక్షణ కలిగిన విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏఎస్సై క్రిష్ణారావు అన్నారు. శనివారం తిప్పనపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన అవగాహన సమావేశంలో ఏఎస్సై ముఖ్య- అతిధిగా పాల్గొని ప్రసంగించారు. చిన్న వయస్సులో మంచి అలవాట్లు ఉంటే పెద్దవారు అయినా తర్వాత మంచి ఉన్నత భవష్యత్తు ఉంటుందన్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే విద్యార్థులకు మంచి అలవాట్లు ఉంటాలన్నారు.
చదువుతో పాటు క్రమశిక్షణ ఉంటేనే మంచి విద్యార్థులుగా తయారవుతాడన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. మంచిగా ఉండి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గురువులకు పేరు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎం సుజాత, తదితరులు
పాల్గొన్నారు.