UPDATES  

 శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న : ఎమ్మెల్యే వనమా

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 28.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని సుజాతనగర్ గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విశిష్ట పూజలను ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని అన్నారు . కాలజ్ఞానాన్ని సమాజానికి చాటి చెప్పిన పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం నేడు మనం జీవిస్తున్న దినచరి కాలచక్రంలో తరచూ ఎదురవుతున్నాయని అన్నారు
ఎమ్మెల్యే వనమా వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఎంపీటీసీ మూడ్ గణేష్, సర్పంచ్ హథిరాం, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ (సంపు), డైరెక్టర్లు నెహ్రూ, గాజుల సీతారామయ్య, రవీందర్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు కృష్ణార్జున రావు, రవి, బావు సింగ్, ఆరిఫ్ ఖాన్, గడ్డం వెంకటేశ్వర్లు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుడి కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !