మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 28
మణుగూరు సింగరేణి జిఎం కార్యాలయం ఆవరణలో శనివారం ఏరియా సింగరేణి బిసి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏరియా ఇంచార్జ్ జిఎం జి నాగేశ్వరరావు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ,సింగరేణి బిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు సింగరేణి సంస్థ పురోగతికి కూడా ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని ఇన్చార్జి జిఎం జి.నాగేశ్వరరావు అన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి బిసి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పీకే ఓ సి, సభ్యులు డి.వీరభద్రయ్య,డి శ్రీనివాసరావు,కీర్తి రమేష్,ఆర్ మధు బాబు,సాయిల సురేష్,కే కృష్ణమూర్తి,ఎస్.కె సర్వర్,నబీ, శోభన్ బాబు,సింగు శ్రీనివాస్, ఎస్ కే అబ్దుల్ రవూఫ్,బి శ్రీనివాసరావు,కుమారస్వామి, కన్నమ్మ,తిరుపతయ్య,తదితరులు పాల్గొన్నారు.