మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 29… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో టిడిపి పార్టీ నుంచి గెలిపి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వైఖరిలో మార్పు రాకపోతేనే ఈ తీర్పు ఇస్తున్నామని పలువురు బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకి జలక్ ఇచ్చారు. ఆదివారం చండ్రుగొండ మండలంలో లక్ష్య గార్డెన్ లో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎంపీపీ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు సుమారు 500 మంది పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వైఖరి పై తీవ్రమైన స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మెచ్చా టిడిపి నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ లో గెలిచిన ప్రజాప్రతినిధులను సీనియర్ నాయకులను పక్కనపెట్టి ఆయనతో వచ్చిన కొందరి నాయకులకు పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగే విధంగా ప్రవర్తించుచున్నారని వారి ఆరోపించారు. పార్టీ కార్యక్రమంలోనూ ప్రభుత్వ పథకాలలోనూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులను విస్మరించి ఆయన విష్టానుసారంగా ప్రవర్తించడం జరుగుతున్నదని విమర్శించారు .ఎన్ని మార్లు తనకు విన్నవించిన తనలో ఎటువంటి మార్పు లేదని బి ఆర్ ఎస్ పార్టీకి అనేక రకంగా నష్టం వాటిల్లే విధంగా ఆయన ప్రవర్తన ఉన్నదని ఈ ఎమ్మెల్యే వలన పార్టీకి పూర్తిస్థాయిలో క్యాడరు నిర్వీర్యం అవటం జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి , పార్టీ క్యాడర్కు నష్టపెట్టే విధానాన్ని పలుమార్లు జిల్లా నాయకత్వానికి మంత్రి పువ్వాడకు ఎంపీ , ఎమ్మెల్సీ లకు జిల్లా ముఖ్య నాయకులకు తెలియపరచడం జరిగిందన్నారు అయినా తనలో ఎటువంటి మార్పు రాలేదని ఈ సమావేశం నిర్వహించడం జరిగినదన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే తీరు మారకపోతే తీసుకోబోయే నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ , వైస్ ఎంపీపీ సహకార సంఘ అధ్యక్షులు, సర్పంచులు ముగ్గురుఎంపీటీసీలు ఆరుగురు సోసైటీ డైరెక్టర్లు జిల్లా రైతు కోఆర్డినేటర్ మండల రైతు కోఆర్డినేటర్ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు జిల్లా నాయకులు ముఖ్య కార్యకర్తలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు వందల సంఖ్యలో పాల్గొనడం జరిగింది.