మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 29…. ప్రజలకు అతి తక్కువ ఖరీదు తో నాణ్యమైన వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు వైద్యులు కృషి చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి పల్లి మొరేడు బ్రిడ్జి వద్ద వి కేర్ మల్టీస్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నెలకొల్పబడటం ఎంతో ఆనందంగా ఉందని అదే రీతిలో ప్రజలకు వైద్యం అందించేందుకు ప్రతినిత్యం డాక్టర్లు అందుబాటులో ఉండాలని కోరారు. వైద్యులు మంచి పేరు తెచ్చుకుంటూ ఆసుపత్రి త్వరగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, కొత్తగూడెం పట్టణ ప్రముఖ వైద్యులు నాగరాజు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, డైరెక్టర్లు యాకూబ్, జాని, శేషాద్రి వినోద్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు కృష్ణార్జున రావు, అజయ్ స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వి కేర్ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.