మన్యం న్యూస్ గుండాల, జనవరి 29.. ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) గుండాల మండలం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా తాటి రమేష్ , ఎనుగంటి లాజర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలం పరిధిలోని చీమల గూడెం గ్రామంలో ఏడవ మహాసభను నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో 1400 మంది అమరులయ్యారని వారి కుటుంబాల ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ నెరవేర్చలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు అధ్యక్ష కార్యదర్శులతో పాటు నూతనంగా 23 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు