మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 29 …దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. ఆదివారం ఆయన జన్మదినం సందర్భంగా కొత్తగూడెం క్లబ్ లో దివ్యాంగుల దినోత్సవం, దివ్యాంగుల ఆదర్శ వివాహం సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరైన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పోటీలలో పాల్గొన్న వారికి తన సొంత ఖర్చులతో ప్రత్యేక బహుమతులను బహుకరించారు. ఇదే వేదికపై ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని దివ్యాంగుల, అనాధలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పేర్కొన్నారు. దివ్యాంగులను మన పిల్లలుగా భావించి వారిలో మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. దివ్యాంగుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని దివ్యాంగులు, అనాధ, నిరుపేద ప్రజల సేవే లక్ష్యంగా టీవీపిఎస్ సతీష్ ముందుకెళ్తున్నట్టు తెలిపారు. సాటివారికి సహాయం చేయడంలోనే ఆనందం ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరీం పాషా,సుజాతనగర్ ఓ బి సి మండల అధ్యక్షుడు కసనబోయిన లక్ష్మణ్,యువజన కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ తేజావత్ శ్రీనివాస్,తేజావత్ సాయి తదితరులు పాల్గొన్నారు