మన్యం న్యూస్ గుండాల, జనవరి 29.. ప్రజలకు కావలసిన విద్య, వైద్యం, విద్యుత్ తదితర సమస్యలను ప్రభుత్వం తీర్చాలని ఈ వై యల్ జిల్లా కార్యదర్శి వాంకుడు అజయ్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో కొత్తగూడెం జిల్లా జాయింట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేద ప్రజల పై పన్నుల పెను భారాన్ని మోపుతుందన్నారు. ఇప్పటివరకు ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సైతం నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల హామీలను నెరవేర్చాలని అన్నారు. ప్రజలపై మోపిన ఏ సి డి అదనపు బారాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు నాయకురాలు సావిత్రి, కల్పన, ప్రజాపంద మండల కార్యదర్శి శంకరన్న, బండారి సత్యం, ఇస్లావత్ కోటి, సరోజిని, కృష్ణ , వెంకటేశ్వర్లు, సనప కుమార్, పూనెం మంగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు