మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 29:
మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన బొజ్జ పద్మ, పుట్టి ముత్తమ్మ, దాసరి జాను లకు ఆదివారం జాతీయ మాల మహానాడు పినపాక నియోజకవర్గ ఇన్చార్జ్, మండల అధ్యక్షుడు పిల్లి రవివర్మ, జిల్లా జాతీయ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బోడ దివ్య ల ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు , 75 కేజీల బియ్యం బ్యాగులను అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు పిల్లి రవివర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు తాటి రవి, పెరుమళ్ళ సురేష్, మీసాల సురేష్, కొట్టే రమేష్, ఆర్ఎంపీ గోవింద్, గడేసుల రమేష్, తుమ్మల బాలకృష్ణ, బత్తుల రమేష్, పర్వ ప్రవీణ్, గడేసుల లాజర్, తాటి శేఖర్, దారావత్ రాంబాబు ల సహకారంతో బియ్యంను అందజేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.