UPDATES  

 కాంగ్రెస్ పార్టీలోనే దొంగలు పడ్డారు ఇక దొంగల ఏరివేత పనిలో మేము పడుతున్నాం

  • కాంగ్రెస్ పార్టీలోనే దొంగలు పడ్డారు
  • ఇక దొంగల ఏరివేత పనిలో మేము పడుతున్నాం
  • ఇక ముసలి నాయకత్వం మూలకే
  • తెరపైకి యువరక్తం రావాలి
  • డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య బ్రిడ్జి దాటి రారు
  • ఫిబ్రవరి 1న ఉమ్మడి జిల్లాలో.. సేవ్ కాంగ్రెస్ సభను విజయవంతం చేయండి..
  • విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తిన రాష్ట్ర నాయకులు డాక్టర్ శంకర్ నాయక్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 29.. శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టేందుకు ప్రబుద్ధులు బయలుదేరారు.. నమ్మబలికి ఆ పార్టీని నట్టేట్లో ముంచేందుకు స్వయంగా సొంత పార్టీలోనే దొంగలు పడ్డారు.. కాంగ్రెస్ పార్టీని ముందుంచి నడిపేందుకు దశా దిశకు దిక్కేలేదు.. ఎవరిని నమ్మమంటారు ఎలా సాగిపొమ్మంటారు. ఇక చాలు నక్క వినయాలు నట కిరీటలను నమ్మే పరిస్థితిలో మేము లేము. కాంగ్రెస్ పార్టీని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అందుకే సేవ్ కాంగ్రెస్ నినాదంతో ఫిబ్రవరి 1 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ ధ్వజమెత్తారు. ఆదివారం భద్రాది కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు వ్యవహార శైలి చూస్తుంటే ప్రస్తుత నాయకత్వం మొత్తం నవ్వులు పాలు అయ్యే ప్రమాదం ఉందని అలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత అందరి పై ఉందన్నారు. పదవి వ్యామోహంతో పదవులు దక్కించుకున్న కొందరు అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ముందస్తుగా అరెస్టులు చేస్తే కాంగ్రెస్ నాయకులు కొందరు జైల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని కనీసం పరామర్శించడానికి అయినా రాలేదని విమర్శించారు. ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎక్కువయ్యారని వారి వలన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలో బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదగడమే కాకుండా క్యాడర్ లీడర్ ఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ కయ్యాల పార్టీగా తయారయిందని పదవులు పొందుతున్న కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డిసిసి జిల్లా అధ్యక్షులుగా ఉన్న భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య, కనీసం భద్రాచలం బ్రిడ్జి కూడా దాటి రాని పరిస్థితిగా కనపడుతున్నారన్నారు. కనీసం కార్యకర్తలతో గానీ జిల్లా నాయకత్వంతో గాని రివ్యూ మీటింగ్ లో పెట్టడం లేదన్నారు. కాంగ్రెసులో కొందరు కోవర్టులు దొంగ చాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కౌగిలించుకుంటున్నారని అలాంటి వారితో మేము సాగేందుకు ఇష్టపడటం లేదన్నారు. ఫిబ్రవరి 1న సేవ్ కాంగ్రెస్ నినాదంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభకు జిల్లా నాయకులు లక్కినేని సురేంద్రర్ నాయకత్వంలో అందరం పనిచేస్తామని స్పష్టం చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 6న భద్రాచలం నుంచి తలపెట్టనున్న హాత్ సే హాత్ మిలావ్ పాదయాత్రను సుమారు వేలాది మందితో జయప్రదం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత తీసుకొని జయప్రదం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు లక్కినేని సురేందర్, సుధాకర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, పేటేటి నరసింహ రావు, దల్ సింగ్ నాయక్,
చెన్నకేశవరావు, పాండురంగ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !