ముఖ్యమంత్రి సార్ ని కోరిన మొదటి కోరిక మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకం
*పినపాక నియోజకవర్గం పై సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ప్రేమ
*ఎత్తిపోతల పథకం మంజూరు చేసిన సీఎం కి కృతజ్ఞతలు
*అశ్వాపురం రైతుల కల నా హయాంలో సహకారం అవుతుండడం సంతోషంగా ఉంది
*17వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం
*రూ.25కోట్ల తో పంప్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్,మణుగూరు(అశ్వాపురం):నీళ్ళు, నిధులు, నియామకాల కొరకు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం .కానీ ఈ నినాదానికి భిన్నంగా మా అశ్వాపురం మండలం లో నిర్మితం అవుతున్న సీతారామ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి సాగు,త్రాగునీరు అందించనుంది.కానీ ఇదే ప్రాజెక్టు తో మా మండలానికి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన తొలి రోజే విన్నవించడం జరిగిందని, తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్ ఆయా శాఖల అధికారులతో ఆనాడుసమావేశం ఏర్పాటు చేశారని… ఆనాటి సీఎం కేసీఆర్ ఆశీర్వాదమే నేటి మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకం అని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన ఆదివారం మండల పరిధిలోని
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదనపు ఆయకట్టు పంప్ హౌస్ నిర్మాణ పనులకు బిజీ కొత్తూరు గ్రామంలో భూమి పూజ నిర్వహించారు.ఈ ప్రాజెక్టు వలన మారేళ్ళ పాడు సస్యశ్యామలం అవుతుందన్నారు. మొదటి విడత 17 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతులు, రైతు కూలీలకు చేతి నిండా పని దొరుకుతుందని, రైతులు ఆలోచించాలన్నారు. ప్రభుత్వం అనుకున్న విధంగా మాట ఇచ్చిన విధంగా ప్రాజెక్టు నిర్మించి చూపేట్టిందన్నారు. చెప్పని పనులను కూడా చేసి చూపెట్టిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రాజెక్ట్ దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని, ఇది మనందరి అదృష్టం అన్నారు. మన పథకాలను, కెసిఆర్ నాయకత్వాన్ని దేశంలోని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గొందిగూడెం గ్రామంలో డెలివరీ సిస్టం ఏర్పాటు చేసి పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ ద్వారా డెలివరీ సిస్టంకు తరలించడం జరుగుతుందని, అక్కడ నుండి గ్రావిటి ద్వారా ఎడమ కాలువ కుడి కాలువ ద్వారా మండలంలోని ప్రధాన సాగునీటికి అవసరమైన అన్ని చెరువులలోకి, కుంటలకు నీరు అందనుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లకు రుణపడి ఉంటానని, వెనకబడిన ప్రాంతమైన పినపాక నియోజకవర్గానికి అడిగిందే తడువు నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం ఆదివాసి గిరిజన ప్రాంతమని, రైతాంగం భూములు బీడు భూములుగా మారాయని, దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ వారి బాధలను తీర్చాలని వారి మీద ఉన్న ప్రేమతో సదుద్దేశంతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మొoడికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రo అశ్వాపురం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గజ్జల లక్ష్మారెడ్డి వెన్న అశోక్ కుమార్ మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు యువజన నాయకులు మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారుప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.