మన్యం న్యూస్ జనవరి30: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంబజర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా చీమల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గం అహింసా సత్యం మార్గం లో ప్రతిఒక్కరూ నడుచుకోవాలన్నారు. గాంధీ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర పూర్తి అయిన తరుణంలో కూరగాయల మార్కెట్ వద్ద గల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో జెండా ఆవిష్కరణ చేసారు.డాక్టర్ రవి మాట్లాడుతూ యాత్ర యొక్క ఉద్దేశ్యాన్ని గడప గడపకు చాటుతాం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.