మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో ఆళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీలో సోమవారం చేరికలు జరిగాయి. రాయపాడు గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ నాయకులు రేగా సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి రేగా కాంతారావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రేగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసానిచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకే పని చేస్తూ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రగతి పదములో పల్లెలను నిలుపుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జ్ భవాని శంకర్, పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, జడ్పిటిసి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, మైనార్టీ జిల్లా అధ్యక్షులు అన్వర్,ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు